రామ్ గోపాల్ వర్మ దొంగల ముఠా దోంగతనం ఎక్కడిదాకా వచ్చిందంటే..
రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. ఏ పని చేసినా, ఏ సినిమా చేసినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని తపిస్తుంటాడు తను. సినీ పరిశ్రమను నేపధ్యంగా తీసుకొని హాస్య నటుడు సునీల్‌తో ఆయన రూపొందించిన 'కథ-స్క్రీన్‌ప్లే-అప్పల్రాజు" సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతుండగా, వర్మ మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులలో ఎవ్వరికీ పారితోషికాలు ఇవ్వకుండా, అయిదే అయిదు రోజుల్లో 'దొంగల ముఠా" పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ సినిమా చిత్రీకరణ బుధవారం ప్రారంభమైంది. రవితేజ, చార్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ మంచు ఓ ముఖ్యపాత్రను చేస్తున్నారు.
శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాలను నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వర్మ పంచుతారని సమాచారం. ఈసినిమాలో డా. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజు, సుప్రీత్, బ్రహ్మాజి తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











