'దొంగల ముఠా' సూపర్ హిట్ ఎలాగంటే... వర్మ
దొంగల ముఠా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రవితేజ గత చిత్రం మిరపకాయ తో పోల్చి ఈ చిత్రం సూపర్ హిట్ అని తేల్చారు. అంతేగాక ఈ చిత్రంపై డిస్కషన్ ఓవర్ అని ప్రకటించారు. ఈ స్టేట్ మెంట్ ని సపోర్టు చేసుకోవటానికి వర్మ కొన్ని కారణాలును పెర్కొన్నారు.
1. దొంగల ముఠా చిత్రం అన్ని సినిమాల్లా చాలా ఖరీదైన సూపర్ 35 కెమెరాలతో తీయబడలేదు. ఈ చిత్రం కెనాన్ స్టిల్ కెమెరాతో తీయబడింది. ఈ సినిమా చూసిన వాళ్ళెవరూ సినిమా క్వాలిటీ విషయంలో కంప్లైయింట్ చేయలేదు.
2.అలాగే ఈ సినిమా ద్వారా నిరూపితమైన మరో సత్యం. ప్రేక్షకులు సినిమాని 120 రోజుల్లో తీసారా..200 మంది క్రూ మెంబర్స్ తో తీసారా అనే విషయం చూడరు.ఏడుగురు తో ఐదు రోజుల్లో తీసిన సినిమాకు కూడా అంతే ఇంట్రెస్టు తో సినిమాకు వస్తారు.
3. ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయిన మరో సత్యం...కెమెరా మెన్ కూడా లేకుండా సినిమా తీయవచ్చు.
4. సినిమా ప్లాప్ ..హిట్ అని నిర్ణయించేది ..ఎప్పుడూ ఎంత పెట్టుబడి పెట్టాం..ఎంత రిటన్ వచ్చింది అనే విషయంపై. ఈ విషయంలో దొంగల ముఠా విజయం సాధించింది.
5. రవితేజ గత చిత్రం మిరపకాయ తో పోలిస్తే ఈ చిత్రం చాలా బెటర్ అది ఎలాగంటే...
మిరపకాయ చిత్రానికి అయిన ఖర్చు ..14 కోట్లు...దొంగల ముఠా అయిన ఖర్చు...6 లక్షలు..
మిరపకాయ రిలీజ్ అయిన ధియోటర్లు...300 పైగా...దొంగల ముఠా అయిన ఖర్చు....300 కి పైగా
మిరపకాయ కి రవితేజ పని చేసిన రోజులు...దాదాపు 65 రోజులు. దొంగలముఠా అయిన ఖర్చు...కేవలం 5 రోజులు.
మిరపకాయ ప్రారంభం నుంచి ఫినిష్ అవటానికి పట్టిన రోజులు...8 నెలలు...దొంగల ముఠా చిత్రం ప్రారంభం నుంచి ఫినిష్ అవటానికి పట్టిన రోజులు 33 రోజులు..
మిరపకాయ మొదట ఆట కలెక్షన్ తర్వాత బ్రేక్ ఈవెన్ కి ఇంకా రావల్సిన మొత్తం...పెట్టుబడిలో 90 శాతం..
దొంగల ముఠా విషయానికి వస్తే రిలీజైన వెంటనే పెట్టుబడి పైన పదింతలు పైన లాభం వచ్చింది.
వెరసి దొంగల ముఠా సూపర్ హిట్టయింది. ---డిస్కషన్ ఈజ్ ఓవర్...


Click it and Unblock the Notifications











