కోడి రామకృష్ణ దొంగోడి పెళ్ళి జులైలో
కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజేంద్రబాబు హీరోగా రూపొందిస్తున్న దొంగోడి పెళ్ళి రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమాను కొత్త నిర్మాతలు ప్రతాప్‌సింగ్, రాయపురెడ్డి సూరిబాబు (రాజా) ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిర్మాతలు కొత్తవారైనా మంచి అభిరుచితో అన్ని విధాలా సహకరించినట్టు దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పారు. ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. దొంగోడి పెళ్ళి తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకూ మంచి స్పందన వస్తోందని, హీరోయిన్లు జలక్‌నందిని, రత్నా బట్టాల్ కొత్తవారయినా, సహజంగా నటించారని ఎగ్జిక్యూటివ్ నిర్మాత జంపన రామరాజు తెలిపారు.


Click it and Unblock the Notifications