సోషల్ క్రైమ్, ఓ అమ్మాయి జీవితం: అమలా పాల్
అమలా పాల్, బాబీ సింహా, ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దొంగోడొచ్చాడు’ టీజర్ విడుదలైంది.
అమలా పాల్, బాబీసింహా, ప్రసన్న ప్రధాన తారాగణంగా తమిళంలో 'తిరుట్టుపయలే 2' సినిమాను తెలుగులో 'దొంగోడొచ్చాడు'గా విడుదల చేస్తున్నారు. కల్పతి ఎస్.అఘోరన్ సవుర్పణలో ఎ.జి.ఎస్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మితవువుతోంది. సుశీ గణేశన్ దర్శకుడు. డిసెంబర్ రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది.
హైదరాబాద్ లో ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమలా పాల్, బాబీ సింహా, ప్రసన్న తో పాటు దర్శకుడు సుశీ గణేశన్ పాల్గొన్నారు.

సోషల్ క్రైమ్
సోషల్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. మల్లన్న సినిమాను డైరెక్ట్ చేసిన సుశి గణేశన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రసన్న నటించిన సన్నివేశాలు ఆశ్చర్య పరిచే విధంగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపారు.

ఓ అమ్మాయి జీవితం సోషల్ మీడియా కారణంగా
హీరోయిన్ అమలా పాల్ మాట్లాడుతూ... జీవితంపై మంచి కలలు, ఆశలు, కోరికలు ఉన్న ఓ అమ్మాయి జీవితం సోషల్ మీడియా కారణంగా ఎలా మారిందనేదే ఈ సినిమా. సుశిగారితో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు.

దొంగోడొచ్చాడు
సుశి గణేశన్ మాట్లాడుతూ... సోషల్ మీడయా నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రతి పాత్రకు గ్రే షేడ్ ఉంటుంది. ప్రతి వ్యక్తి అంతర్గతంగా వేరుగా ఉంటాడు. అవకాశం రావాలే కానీ..ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని చూపించే సినిమా ఇది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











