'మహేష్ ఖలేజా' ని మిస్సవద్దు అంటున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ నిన్న(బుధవారం) రాత్రి ప్రసాద్ ప్రివ్యూ ధియోటర్ లో ఖలేజా చిత్రం స్పెషల్ షో చూసారు. నిర్మాత సి.కళ్యాణ్ ఈ షోను ఎరేంజ్ చేసారు. ఇక బాలకృష్ణ ఈ సినిమాను తన కుటుంబ సభ్యులతో వచ్చి చూసి వెళ్ళారు. ఆయన చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. ఇక ఆ షో అయిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు,రాజకీయ నాయకులకు ఈ చిత్రం మరో షో వేసారు. అలాగే ఈ చిత్రం బెనిఫిట్ షోలతో ఈ రోజు(అక్టోబర్ 7) ప్రపంచమంతటా విడుదలైంది. మహేష్, అనూష్క కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక బాలకృష్ణ అయితే సూపర్ మూవీ, మహీ చాలా ఎక్సలెంట్ గా చేసాడు..డోంట్ మిస్ మహేష్ ఖలేజా అని అన్నారు.
బాలకృష్ణ అనుష్క మహేష్ బాబు సునీల్ బ్రహ్మానందం త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు ఖలేజా balakrishna anushka mahesh babu khaleja jalsa trivikram srinivas athadu


Click it and Unblock the Notifications