»   » ఈ రసాలే నాశృంగార రసానికి విజయ రహాస్యం అంటున్న సెక్సీ హిరోయిన్..

ఈ రసాలే నాశృంగార రసానికి విజయ రహాస్యం అంటున్న సెక్సీ హిరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గాతనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది. అంతేకాకుండా రెమ్యూనరేషన్ లోతనరేంజ్ నికూడా పెంచింది. ప్రస్తుతం కుర్ర హీరోలతో దూసుకుపోతుంది. జూ ఎన్టీఆర్ తో శక్తిగా, రాణా తో నేను నారాక్షసిగా అలరించనుంది. ఇప్పటికే టాలీవుడ్ లోతన హావా కోనసాగుతుంది. ఇక ఈరెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే ఇక మన రాక్షసిని పట్టకోవడం చాలా కష్టం. ఇటీవల కాలంలో తన శరీరం మంచి షేపుని సంతరించుకోవడానికి కారణాలు ఏంటా అని ఆరాతీయగా తన మనసులోని కోన్నిభావాలను వెల్లడించింది.

తను సినిమాల్లో అంత సెక్సీగానూ..యవ్వనంతో మిసమిసలాడుతూ కనబడటానికి కారణాలు ఎన్నో ఉన్నాయంటోది. నిత్యం యోగా చేయడంతోపాటు తీసుకునే ఆహార పదార్థాలలో శ్రద్ధ కనబరుస్తానని చెపుతోంది. పాలకూర, కొత్తిమీర, పుదీనా ఆకులనుంచి తీసిన రసాన్ని ఇలియానా తాగుతుంటుందట. ఈ రసాలే తన యవ్వన రహస్యమని ఇలియానా చెపుతోందట. అంతేకాదు…జొన్న, సజ్జ, మొలక ధాన్యాలను తీసుకుంటుందట. ఎక్కువగా తనే కూరగాయల మార్కెట్ కెళ్లి… సొర, కాకర, పొట్ల, వంకాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, చిలకడ దుంప వంటివన్నిటినీ కొనుగోలు చేస్తుందట.

షూటింగ్ ‌లకు వెళ్లినప్పుడు తనతోపాటు క్యారెట్లను తెచ్చుకుంటుందట. షూటింగ్ గ్యాప్‌ లో క్యారెట్‌లను కరకరలాడిస్తుందట. అందుకేనన్నమాట “క్యారెట్లా" నిగనిగలాడుతోంది ఇలియానా అని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తతానికి తెలుగు చిత్ర సీమ తన మాతృసంస్ద అని చెబుతున్న ఇలియానా త్వరలో బాలీవుడ్ కూడా వెళ్శనుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రీ ఇడియట్స్ తో కమిట్ అయ్యిందని సమాచారం. ఇలియానాని తెలుగు, తమిళ వెర్షన్స్ లకు హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తమిళ వర్షన్ లో విజయ్ హీరోగా నటించనున్నారు. ఈసినిమాకి రోబోలాంటి బ్రహ్మండమైన బాక్సాఫీసు సినిమాని అందించినటువంటి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu