హాలీవుడ్ చిత్రం 'అవతార్' చూడద్దు: రామ్ గోపాల్ వర్మ

By Srikanya

జేమ్స్ కెమెరాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'అవతార్' చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ...ఈ సినిమాను చూడకండి..అనుభవించండి..అంటూ తన ఎక్సపీరియన్స్ వివరిస్తున్నారు. నేనెప్పుడూ దేముడ్ని నమ్మను..కానీ దర్శకుడు జేమ్స్ కెమరాన్ దేముడు కన్నా గొప్పవాడని మాత్రం అనిపించింది.ఎందుకంటే ఆయన చాలా అధ్బుతమైన, అందమైన,ఉత్సాహవంతమైన,ఎక్సైట్ మెంట్ కి గురిచేసే ప్రపంచాన్ని సృష్టించాడు. దేముడు కూడా ఇట్లాంటి ప్రపంచాన్ని ఊహించిఉండడు సృష్టించటానికి..అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా ఐమాక్స్ లో అవతార్ ..త్రిడీ చిత్రం ప్రీమియర్ షో చూసి ఈ కామెంట్ చేసారు. ముప్పై ఏళ్ళ క్రిందట స్టార్ వార్స్ చూసాను..మళ్లీ ఇంతకాలానికి మళ్ళీ అంతటి గొప్ప సినిమా చూసాను అని అనుభూతికి లోనవతూ తన బ్లాగ్ లో రాసుకున్నారు. అయితే కొంతమంది టైటానిక్ తో పోలుస్తూ ఎమోషన్ కోషియంట్ తక్కువుగా ఉందంటున్నారు. దానికి నేను ఒప్పుకోను...ఈ చిత్రంలో బ్రీత్ టేకింగ్ విజువల్స్ ఉన్నాయి. సాధారణ మనుష్యులుతో ఉన్న సాధారణ చిత్రం కాదు. ఈ చిత్రాన్ని ఆయన 1200 కోట్లు బడ్జెట్ తో తీసారు. అయితే మనకీ లండన్ డ్రీమ్స్,కంఫక్త్ ఇష్క్ వంటి చిత్రాలు 80,90 కోట్లతో సినిమాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వంద కోట్లు కూడా ఖర్చు పెట్టి బాలీవుడ్ సినిమాలుతీస్తున్నారు.

అయితే వాటిని 1200 సార్లు బెటర్ చేసినా అవతార్ లాంటి ప్రాడెక్టు రాదనేది నిర్విదాంశం. నిజానికి నాకైతే అవతార్ సినిమాను వంద లేదా రెండు వందల రూపాయల అతి తక్కువ ఖర్చుతో చూడటం క్రైమ్, అన్యాయం అనిపించింది. ఇక నన్ను కొంత మంది అడిగారు..అవతార్ లో గ్రాఫిక్స్ ఇక్కడ వారిని ప్రేరేపిస్తాయా అని..దానికి ఒకటే సమాధానం..మనం కొంతమంది ఆయన లాంటి వారి పొటిన్షియల్ ని మాత్రమే రీచ్ కావటానికి ప్రయత్నిస్తాం. అయితే ఆయన అవతార్ మాత్రం బెంచ్ మార్క్ క్రియేషన్. అలాగే చాలామంది అంటున్నట్లుగా టైటానిక్ గొప్ప సినిమానే కానీ..నన్ను ఇంతలా షేక్ చేయలేదు. ఏదైమైనా జేమ్స్ కెమరాన్..గాడ్ ఆఫ్ ది సినిమా. ఆయన్ని నేను ఆరాధిస్తున్నాను. నేను భక్తుడిలా మారి నేను అవతార్ లాంటివి చేసేలా దీవంచమంటున్నాను.

అలాగే ఆయన్ని హేట్ చేస్తున్నాను..ఎందుకంటే ప్రపంచంలో నా లాంటి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ఎర్ర చీమలుగా మార్చినందుకు. నేను ఆయనలోని సినిమా పట్ల ప్యాశన్ కీ, ఓపికకీ ఇష్టపడతాను. చివరగా ఆయనకు అలాంటి అద్బుతాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను..అంటూ ముగించారు. చివరగా నేను అవతార్ సినిమాను ఎలా నమ్ముతానంటే...అవతార్ కి ముందు తరం అవతార్ తర్వాత తరం అని సినిమాలను విభించేంతగా. ఈ సినిమాను చూడకండి..అనుభవించండి..అంతే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X