సీమాంధ్రుల సినిమాలను చూడద్దంటూ పిలుపు
సీమాధ్రవాసులు నిర్మిస్తున్న సినిమాలను చూడకుండా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే చిన్న సినిమాలను ఆదరించాలని తెలంగాణ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదర్‌గూడలో ఈ కమిటీ ఆధ్వర్యంలో 'తెలంగాణకు కోస్తాంధ్ర సినిమా అవసరమా..?' '24 ప్రేమ్ ల్లో తెలంగాణ వాటా ఎంత?' అన్న అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆధిపత్యం అధికమై తెలంగాణ యాస, భాషను కించపరిచేలా చిత్రాలను నిర్మిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలను సంరక్షించుకోవాలని అన్నారు. సినిమా సామాన్యుడి వినోదమని..దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కమిటీ పేర్కొంది.


Click it and Unblock the Notifications











