నా యోని..నా ఇష్టం
ప్రతీసారి నా యోని గురించే చర్చ..అది అంత అవసరమా..నేనేమీ వారి యోనిల గురించి మాట్లాడటం లేదే..ఎందుకు నా విషయాల్లోకి తలదూరుస్తారు అంటూ విరుచుకుపడుతోంది ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్ సాండ్రా బుల్లక్ .నలభై నాలుగేళ్ళ ఈ ముద్దుగుమ్మ బ్రిటన్ లోని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.నాకు పిల్లలు లేరని అదేదో పెద్ద సమస్యలా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ పిల్లలని ఎందుకు కనలేదని మొహం మీదే అడుగుతున్నట్లు రాస్తున్నారు..మాట్లాడుతున్నారు. ఆ మధ్య కాంటాక్ట్ మ్యూజిక్ డాట్ కాం వారు నేను ఇంకా ఎందుకు గర్భవతిని కాలేదన్న దానిపై రీసెర్చి చేసి వ్యాసాలు ప్రచురించారు. అంది అంత అవసరమా..నా యోని నా ఇష్టం అంటూ కాస్త వల్గర్ గానే ఆమె సమాధానమిచ్చింది. అలాగే తను ఎందుకు బిడ్డలు వద్దనుకుంటోందో చెప్పుకొచ్చింది.
నాకు పిల్లలంటే ఇష్టమే..అయితే వాళ్లకీ తండ్రకి కావాలి. అందుకే నాకు సరైన లైఫ్ పార్టనర్ లేనిదే ఆ పని చేయను. నేను సెల్పిష్ తల్లిని కాలేను.అలాగే నాకు పిల్లలు కావాలనుకున్న క్షణమే నా జీవితం మార్పు తీసుకుంటుంది. అయినా నా దృష్టిలో..జీవితం అంటే జీవితమే..నీ శరీరంనుంచి వచ్చేదానిపై నువ్వు పూర్తి భాద్యత కలిగిఉండాలి.రేపు నేను ఇంటికి వెళ్ళి అరే నేను ప్రెగ్నింట్ ని అని ఆనందపడొచ్చు. కానీ అది ప్రపంచం మొత్తానికి ఆనందం కలిగించే విషయమేమీ కాదు కదా. ఏదైమైనా మంచి పేరెంట్ గా అనిపించుకుంటాను అనుకున్న రోజున తప్పనిసరిగా తల్లిని అవుతాను..అప్పటివరకూ నాతో నేను పెంచుకుంటున్నా పిల్లలు ఉంటారు అంది.ఇక ప్రస్తుతం సాండ్రా బుల్లక్ మోటర్ బైక్ రేస్ లలో పాల్గొనే జెస్సీ జేమ్స్ ని పెళ్లాడి కాపురం చేస్తోంది. అతని మొదటి పెళ్ళాం ముగ్గురు బిడ్డలని ఆమే సాకుతోంది.


Click it and Unblock the Notifications











