మీరెవరూ ఇళ్లలో లిప్ కిస్‌లు పెట్టుకోవటం లేదా? రోడ్లమీదకి రండి: అసహనం తో ఊగిపోయిన హీరోయిన్

Recommended Video

'Don't you kiss at your home లిప్ లాక్ చేస్తే తప్పా

ఒకప్పుడు మన ఇళ్ళలో హాలీవుడ్ సినిమాలు వచ్చినప్పుడూ... పెద్దవాళ్ళకీ టీనేజర్లకీ ఒక సమస్య ఉండేది ఏవైనా రొమాంటిక్ సన్నివేశాలో, లిప్ లాక్ సీన్లో వచ్చీంప్పుడు చానల్ మార్చటమో, లేదంటే అస్సలు టీవీ వైపు చూడటం లేదన్నట్టో నటించేవాళ్ళు. అప్పట్లో ఆ విషయం మహా ఇబ్బందిగా ఉంది. ఆతర్వాత పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళుగానూ, ఆ టీనేజర్లూ పిల్లలూ మామూలు పెద్దవాళ్ళుగానో మారేసరైకి సినిమా లో కూడా చాలా మార్పేవచ్చింది. అలాంటి సీన్లు బాలీవుడ్ లోకీ, అటునుంచి క్రమంగా తాలీవుడ్ లోకీ వచ్చేసాయి. ఇప్పుడు లిప్ లాక్ అంటే సర్వసాధారణమైన విషయం అయిపోయింది... ఇదే విషయాన్ని ఇంకోసారి మీడియా వాళ్లకి గుర్తు చేసి మరీ క్లాస్ తీసుకుంది ఆండ్రియా...

 ఆండ్రియా

ఆండ్రియా

ఈ మధ్య నన్ను ఇరిటేషన్ కి గురిచేస్తున్నవి మూడు విషయాలు అవి మీడియా..! మీడియా..!! మీడియా !!!అంటూ ఆమధ్య కామెంట్ చేసిన ఆండ్రియా కి ఇంకా ఆకోపం పోయినట్టు లేదు, మీడియా పేరెత్తినా.. సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వాళ్ల గురించి మాట్లాడినా ఆండ్రియాకు కోపం వచ్చేస్తుంది.

 లిప్ లాక్ సీన్స్ గురించి

లిప్ లాక్ సీన్స్ గురించి

తాజాగా సిద్దార్థ్ సరసన ‘గృహం' సినిమాలో నటించిన ఆండ్రియా.. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన లిప్ లాక్స్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు అదే రకం అసహనం తో తనదైన శైలిలో బదులిచ్చింది."లిప్ లాక్ సీన్స్ గురించి కేవలం మీడియానే ఇంకా విమర్శనాత్మక కోణంలో చూస్తోంది.

ముద్దులే పెట్టుకోవట్లేదా?

ముద్దులే పెట్టుకోవట్లేదా?

ఒకసారి రోడ్డు మీదికి వచ్చి చూడండి.. ఈ కాలం యువత ఇలాంటి వాటిని చాలా సహజంగా భావిస్తోంది. లిప్ లాక్ అశ్లీలం, అసభ్యం అనే వాళ్లందరూ నిజ జీవితంలో ముద్దులే పెట్టుకోవట్లేదా? లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని.. దాని గురించి మాట్లాడటం పాత పంచాంగం లాంటి విషయం'' అంటూ కోపాన్ని అనుచుకుంటున్న రీతిలో గట్టిగానే క్లాస్ తీసుకుంది ఈ యాంగ్రీ హాట్ హీరోయిన్.

 ఇంటర్వ్యూలిచ్చే స్థాయికి ఎదగలేదు

ఇంటర్వ్యూలిచ్చే స్థాయికి ఎదగలేదు

తమిళంలో ఇటీవలే విమర్శల ప్రశంసలందుకున్న ‘తారామణి'లో నటించిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ఇదో గొప్ప సినిమా అని.. దీంతో నటించాక చాలా అవకాశాలు వచ్చేస్తాయని ఆశించిన తనకు నిరాశ మిగిలిందని.. దీంతో ఇలాంటి మంచి సినిమాలో నటించిన సంతోషం తనకు మిగల్లేదని ఆండ్రియా అంది. మీడియాకు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. తాను మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలిచ్చే స్థాయికి ఎదగలేదని.. అంతగా ఏమీ సాధించలేదని ఆండ్రియా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X