»   » మహేష్ ‘ఆగడు’ పుకార్లపై శ్రీను వైట్ల వివరణ

మహేష్ ‘ఆగడు’ పుకార్లపై శ్రీను వైట్ల వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'దూకుడు' లాంటి హిట్ తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. ఇటీవల ఈ చిత్రంపై ఫిల్మ్ నగర్లో రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. 'దూకుడే దూకుడు' అనే ట్యాగ్ లైన్ ఖరారయినట్లు ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 'ఆగడు టైటిల్ నిజమే కానీ, 'దూకుడే దూకుడు' అనేది ట్యాగ్ లైన్ కాదు' అని స్పష్టం చేసారు. దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈచిత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.

ప్రస్తుతం 'ఆగడు' స్క్రిప్టు వర్కు దశలోనే ఉంది. 'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' నేనొక్కడినే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత 'ఆగడు' చిత్రం ఫ్లోర్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.

English summary
"Aagadu title is confirmed..dookude dookudu is not the tag line" Srinu Vytla tweeted. Mahesh Babu and Sreenu Vaitla are teaming up for the second time and after scoring a blockbuster like Dookudu in their previous outing, expectations are sky high on this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X