మహేష్ ‘దూకుడు 20,000’ వాలా
సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా....శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా దూకుడు. ఈ సినిమా 80 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిపిన సందర్భంగా తెలుగు ప్రేక్షకులు ఈ దీపావళిని 'దూకుడు 20,000" వాలాతో జరుపుకోనున్నారు. ఇప్పటి వరకు మనకు 10,000 వాలా మాత్రమే తెలుసు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సరికొత్తగా 'దూకుడు 20,000" వాలాను ప్రత్యేకంగా శివకాశిలో తయారు చేయించారు. ఈ భారీ టపాసులు మన రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్, కాకినాడ, భీమవరం కేంద్రాల్లోని దూకుడు మెయిన్ థియేటర్ల వద్ద దీపావళిలోజు కాల్చనున్నారు.
14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రానికి జి.రమేష్ బాబు సమర్పకులు. థమన్ సంగీతం. మహేష్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్షన్, పంచ్ డైలాగులతో పాటు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పండించిన కామెడీ థియేటర్లలో ఓ రేంజ్ లో నవ్వుల రూపంలో పేలుతున్నాయి.


Click it and Unblock the Notifications











