మహేష్ పుట్టినరోజు కానుకగా 'దూకుడు' ఆడియో...!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర ఆడియో మహేష్ జన్మదిన కానుకగా ఆగష్టు 9న విడుదల కానుందని సమాచారం. తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన దూకుడు పాటలు అద్భుతంగా వచ్చాయని చిత్ర యూనిట్ వర్గాల తెలిపాయి. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.
గతంలో ఉన్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగష్టు 12న విడుదల కావాలి, కాని సినిమా క్వాలిటి ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాంతర కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. దాంతో 'దూకుడు' సినిమా ఆగష్టు చివరి వారంలో లేదా సెప్టంబర్ మొదటి వారంలోనో విడుదల కానుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మీద మహేష్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications










