మహేష్ ‘దూకుడు’అడియో ఎప్పుడంటే
మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దూకుడు". సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నిర్మాతలు చిత్రం ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ 'ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టులో పాటలు సహా సినిమా విడుదల చేస్తున్నాం. అయితే పైరసీకారులు ఆడియో రిలీజ్‌కి ముందే పాటల సీడీలు అమ్మేస్తు న్నారు.
అవి డమ్మీ పాటలు. ప్రేక్షకాభి మానులు వాటిని నమ్మికొనొద్దు. అధికారికంగా ఆగస్టు తొలివారంలో ఆడియో విడుదల చేస్తున్నాం. థమన్ సంగీతం అద్భుతం. అదే నెలాఖరున సినిమా విడుదల చేస్తాం" అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు.తమన్ తోలిసారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్, ముంబై, స్విట్జర్లాండ్ లలో షూటింగ్ జరుపుకుంది. మహేష్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.


Click it and Unblock the Notifications











