మహేష్ బాబు ఉద్వేగంగా డిక్లేర్ చేసేసాడు
మహేష్ తన తాజా చిత్రం దూకుడు షూటింగ్ పూర్తయిన సంగర్భంగా చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేసారు. అందులో ...ఈ రోజే నా దూకుడు చిత్రం చివర రోజు. కొంచెం ఉద్వేగంగా ఉంది.ప్రతీ సెకన్, నిముషం, గంట రోజు ఈ చిత్రం షూటింగ్ లో ఎంజాయ్ చేసాను. ఇది నమ్మశక్యం కాని టీమ్...దర్శకుడు...నిర్మాత..ధాంక్యూ గోపీ గారు..ధాంక్యూ అనీల్ గారూ..ధాంక్యూ రామూ గారూ .నా సూపర్ డైరక్టర్ శ్రీను వైట్ల కి ధాంక్స్..నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇస్తున్నందుకు ..నేను ఇరవై మూడవ తేది కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు. నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్ చేసిన నిర్మాతలు అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు.
తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











