మహేష్ 'దూకుడు' లో సెన్సార్ కట్స్ ఇవే
మహేష్ తాజా చిత్రం 'దూకుడు' కి సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సెన్సార్ కట్స్ ఏమి చెప్పిందంటే...
1) ఎనిమిదవ రీల్ లో షిండే వాడే బాస్టర్డ్ అనే పదం తీసేయాలి
2)ఏడవ రీల్ లో బాటిల్ విజువల్స్ తీసేయాలి.
3)ఏడవ రీల్ లో రాడ్ తో కొట్టే తలపై కొట్టే విజువల్ తీసేయాలి
4)ఏడవ రీల్ లో వచ్చే దొంగనా కొడకా అనే డైలాగుని తొలిగించాలి
5)మూడవ రీల్ లో వచ్చే నీ యబ్బ అని డైరక్టర్ షూటింగ్ లో అనే డైలాగుని తీసేయాలి.
6)నాలుగవ రీల్ లో వచ్చే తలపై కొట్టే విజువల్ తొలిగించాలి.
7)ఏడవ రీల్ లో వచ్చే హీరోయిన్ హిప్ ని హీరో ప్రెస్ చేసే విజువల్ తీసేయాలి.
8)రెండవ రీల్ లో వచ్చే బొంగు అనే పదాన్ని తొలిగించాలి.
9)రెండవ రీల్ లో వచ్చే పాటలో హీరోయిన్ కూర్చుని రెడ్ అండ్ బ్లాక్ చెక్ డ్రెస్ చేసే క్లవరేజ్ ఎక్సపోజింగ్ తొలిగించాలి.
10)రెండవ రీల్ లో వచ్చే బాడకవ్ అనే పదాన్ని తొలిగించాలి.
ఈ 'దూకుడు' చిత్రం ఈ నెల 23న అంటే రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 50400 ఫీట్స్ తో ఉంది. రెండు గంటల యాభై నిముషాల రన్ టైమ్ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











