‘దూకుడు’ ఆగలేదు..సాగుతోంది
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'దూకుడు" సినిమా 50 రోజులు పూర్తి చేసుకుని 100 రోజుల వైపు పరుగెడుతోన్న విషయం తెలిసిందే. అయితే ఎంత సూపర్ హిట్ సినిమా అయినా విడుదలైన అన్ని థియేటర్లలో 100 రోజులు ఆడటం కష్టం కాబట్టి..కొన్ని థియేటర్లలో మినహా, మిగతా వాటిల్లో సినిమాను ఎత్తేస్తున్నారని, ఇప్పటి వరకు సినిమా రూ. 54.45 కోట్ల వసూళ్లు సాధించిందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని తాజాగా అందిన సమాచారం.
దూకుడు కలెక్షన్ల విషయమై ఈస్ట్ గోదావరి 'దూకుడు" డిస్టిబ్యూటర్ రమేష్ చౌదరి మాట్లాడుతూ...ఆ ప్రచారంలో వాస్తవం లేదని, దూకుడు సినిమా ఇంకా విజయవంతంగా కొనసాగుతోందని, పంజా సినిమా విడుదలైన తర్వాత కూడా షేర్ ఇంకా వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 థియేటర్లలో, ఈస్ట్ లో 5 థియేటర్లలో 100 రోజుల పండగ జరుపుకోబోతోందని వన్ ఇండియాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం దూకుడు కలెక్షన్లు కింది విధంగా ఉన్నాయి.
నైజాం : 19 .83 కోట్లు
సీడెడ్ : 9 .2 కోట్లు
నెల్లూరు : 2 .1 కోట్లు
కృష్ణ : 3 .87 కోట్లు
గుంటూరు : 4 .65 కోట్లు
ఉత్తరాంధ్ర : 4 .84 కోట్లు
ఈస్ట్ : 3 .20 కోట్లు
వెస్ట్ : 3 .12 కోట్లు
కర్ణాటక :5 .2 కోట్లు
అదర్ స్టేట్స్: 1 .75 కోట్లు
అబ్రాడ్ : 13 .20 కోట్లు


Click it and Unblock the Notifications











