మహేష్ ప్యాన్స్ కు రేపే పెద్ద పండుగ

ఎప్పుడూ ఒక సినిమాకు మరో సినిమాకు విపరీతమైన సమయం గ్యాప్ తీసుకునే మహేష్ కంటిన్యూగా సినిమా చేస్తూండటంతో వారంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ పాటలు కూడా పెద్ద హిట్టవటం కూడా వారికి కలిసివచ్చిన అంశం. పోకిరి వంటి మెగా హిట్ అందించిన పూరి జగన్నాధ్ దర్సకత్వంలో రూపొందుతున్న బిజినెస్ మ్యాన్ సంక్రాంతికి ఓ రేంజి హిట్టవుతుందని,అన్ని రికార్డులను బ్రద్దలు కొడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఫేస్ బుక్కుల్లోనూ,ట్విట్టర్స్ లోనూ వారు ఈ మేరకు తన స్నేహితులతో ఆనందం పంచుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











