మొదటి రోజు మగధీర రికార్డ్ బ్రేక్ చేసిన ‘దూకుడు’...!?
ఎన్నో ఎక్స్ పెక్టే షన్స్ మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రిన్స్ మహేష్ 'దూకుడు" అన్ని ఏరియాల్లోనూ హిట్ టాక్ తో రన్ అవుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అందరి అంచనాలను మహేష్ రీచ్ అయ్యాడని ఫాన్స్ చాలా ఆనందంగా చెప్తున్నారు. టోటల్ గా ఈ సినిమాకి శ్రీను వైట్ల ఫిలిమ్ అనే లుక్ వున్నప్పటికీ మహేష్ ఫెర్ ఫార్మెన్స్, తెలంగాణా స్లాంగ్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్, మహేష్ చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో మరో ప్లస్ పాయింట్ 'దూకుడు"లో పార్వతి మెల్టన్ అదిరిపోయిందని, ఈ సినిమా సక్సెస్ లో పార్వతికి కూడా భాగముందనే రిపోర్ట్స్ అందుతున్నాయి. అలాగే శ్రీను వైట్ల భార్య రూపా వైట్లకు మంచి మార్కులే పడుతున్నాయి. రూపా వైట్ల హీరోయిన్ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించి, సమంతకు తను డిజైన్ చేసిన డ్రెస్సులకు మంచి మార్కులు పడుతున్నాయి. కాస్ట్యూమ్స్ ట్రెండీగా ఉన్నాయని మొచ్చుకుంటున్నారు. దూకుడు రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లోనూ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గుంటూరు జిల్లాలో మొదటి రోజు 90లక్షలు షేర్ సాధించింది. గతంలో మగధీర చిత్రానికి మొదటి రోజు 58లక్షలు షేర్ వచ్చింది. దాన్ని దూకుడు క్రాస్ చేసింది. నైజాంలో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోందని తెలుస్తోంది.
పోకిరి తర్వాత హిట్ లేని మహేష్ కి 'దూకుడు" ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ క్రాకర్స్ కాలుస్తూ పండగ జరుపుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ లో 'దూకుడు రిలీజ్ రోజు ఫ్యాన్స్ కి, నాకు పండగ రోజు" అని మహేష్ చెప్పినట్టుగానే దూకుడు రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది.


Click it and Unblock the Notifications











