twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకుడులో ఆ డైలాగ్సే హైలెట్స్

    By Srikanya
    |

    ఇన్నాళ్ళూ మహేష్ డైలాగులు అంటే పోకిరి సినిమానే గుర్తుకు వస్తుంది. అలాంటిది.. ఇప్పుడు అతని తాజా చిత్రం దూకుడుతో డైలాగులకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇందులో చెప్పిన పంచ్ డైలాగులు మీడియా ద్వారా,వెబ్ ద్వారా ప్రచారంలోకి వచ్చాయి. మరికొన్ని టీవీ ల్లో ట్రైలర్స్ ద్వారా పాపులర్ అయ్యి జనాల నోట్లో నానుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా...

    1. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతాను.

    2. భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది.

    3. ఒక్కొక్కడి బల్బులు పగిలి పోవాలి.

    4. కళ్లు ఉన్నోడు ముందే చూస్తాడు...కానీ దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు...

    5. ఈ దూకుడే లేకపోతే పోలీస్ మెన్ కీ పోస్ట్ మెన్ కి తేడా ఏముంటుంది.

    6. నేను నరకడం మొదలుపెడితే నరకంలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకోవాలి రా..

    7. మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దానితో పనిలేదు దమ్ముతోనే పని.

    ఇంకా కొన్ని డైలాగులు వినిపిస్తున్నా ఈ డైలాగులుకి బాగా హైప్ క్రియోట్ అవుతోంది.దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు. మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ అంటున్నారు రచయిత గోపీ మోహన్. ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. అలాగే ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

    English summary
    Mahesh has come up with loads of striking one liners to attract his fans. Punch liners like “Mind lo Fix aithe Blind ga velpotha” and “Bhyaniki Meaning ye Theliyani Blood ra nadhi” have garnered huge response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X