మహేష్ దెబ్బకు బలైన యంగ్ హీరో
మహేష్ బాబు దూకుడు ప్రభంజనంలో రామ్ చిత్రం కందిరీగ గురించే జనం మర్చిపోయారు. తన సినిమా సూపర్ హిట్ అని కలెక్షన్స్ తిరగ రాస్తోందని,తనకు ఎదురేలేదని చెప్పుకున్న రామ్ ఒక్కసారిగా కంగారుపడుతున్నారు. ఎక్కడా కందిరీగ గురించి మాట్లాడుకోవటం లేదు. యాభై రోజులు అయ్యేసరికి కందిరీగ హవా చాలా చోట్ల తగ్గిపోయింది. ధియోటర్స్ కూడా చాలా చోట్ల లేవు. అయితే బెల్లంకొండ మొదటి రెండు వారాల్లోనే హిట్ టాక్ తో కలెక్షన్స్ లాగి తన డబ్బుని వెనక్కి లాగేసుకున్నాడు. అందులోనూ రామ్ వెళ్లి బెల్లంకొండతో తగవు పెట్టుకోవటం జీర్ణించుకోలేకోపోవటంతో పబ్లిసిటీ కూడా ఆపుచేసేసాడు.
కేవలం నామమాత్రంగా టీవీల్లో ప్రోమోలు మాత్రమే వస్తున్నాయి. దాంతో రామ్ ఈ ఊహించని పరిణామానికి షాక్ తింటే మరో ప్రక్క రేపటి నుంచి ఎన్టీఆర్ తన ఊసరవిల్లితో ప్రభంజనం మొదలెట్టనున్నాడు. దాంతో పూర్తిగా తన తదుపరి చిత్రం ఎందుకంటే ప్రమంటే మీదే రామ్ పూర్తి దృష్టి అది హిట్ అవ్వాలని చూస్తున్నాడు. కందిరీగ హిట్టుని చూసి తనపై తనకు కాన్పెడెన్స్ పెంచుకుని గౌతమ్ మీనన్ సినిమాలోంచి కూడా బయిటకు వచ్చేసాడు.


Click it and Unblock the Notifications











