'దూకుడు'వి దొంగ రికార్డులు.. నిరూపిస్తే లక్ష
దూకుడు చిత్రం యాభై రోజుల పంక్షన్ విజయవాడలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్ లో ఈ చిత్రం సాధించిన రికార్డులను అందరూ ప్రస్దావించారు. అంతేగాక ఆ ప్రాగణంలో ఆ రికార్డులని ప్రస్దావిస్తూ బ్యానర్స్ సైతం కట్టారు. అయితే దూకుడు సాధించినవి దొంగ రికార్డులని, మగదీరని క్రాస్ చేయలని చిరంజీవి ప్యాన్స్ ఆరోపిస్తున్నారు. వారు విజయవాడలో ఓ బ్యానర్ కూడా వేసారు. విజయవాడ అలంకార్ సెంటర్ లో మగధీర చిత్రానిదే నిజమైన రికార్డులని, అవి ఎవరూ చెరిపెయ్యలేరని బ్యానర్ కట్టారు. అంతేగాక మగధీర చిత్రం ఏయే సెంటర్లలో ఎంతెంత వసూలు చేసింది వారు జిల్లాల వారిగా ఆ బ్యానర్ లో రాసుకొచ్చారు. శాటిలైట్ రైట్స్, ఆడియో, మిగతా అన్ని రైట్స్ కలుపుకుంటే వచ్చిన ఆధాయంతో దూకుడుని పోల్చలేమని స్పష్టం చేసారు.
అంతేగాక మగధీర చిత్రాన్ని ఏ సినిమా అయినా బ్రేక్ చేసిందని నిరూపించినా లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని వారు ప్రకటించి సంచలనం క్రియోట్ చేసారు. దాంతో ఫ్యాన్స్ మధ్యన వివాదం రాజుకుంది. అయితే ఆ హీరోలు మాత్రం ప్రశాంతంగా తమ మరో చిత్రంలో బిజీ అయ్యిపోయారు. మహేష్ తన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ షూటింగ్ లోనూ, రామ్ చరణ్ తన చిత్రం రచ్చలోనూ రెగ్యులర్ గా పాల్గొంటూ తమ కెరీర్ లో మరో హిట్ కు మార్గం వేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











