»   » ఆలోచనల్లోనూ దూకుడుగా ఉండే మహేష్‌ బాబు

ఆలోచనల్లోనూ దూకుడుగా ఉండే మహేష్‌ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఆవేశంలోనే కాదు, ఆలోచనల్లోనూ దూకుడుగా ఉండే యువకుడిగా మహేష్‌బాబు కనిపిస్తారు. 'నీ దూకుడికి సాటెవ్వరు..' అని లోకం కీర్తించేలా ప్రవర్తిస్తాడు. అతని జీవితంలో ఎదురయ్యే సంఘటనల సమాహారం ఈ చిత్రం. మహేష్‌బాబుని కొత్త కోణంలో చూపిస్తున్నాం. యాక్షన్‌ అంశాలతో పాటు, వినోదం కూడా సమపాళ్లలో మేళవించాం" అని మహేష్ తాజా చిత్రం 'దూకుడు' గురించి నిర్మాత చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంల షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ పాటతోపాటు ఫైటింగ్స్ సీన్స్ షూట్ చేస్తారు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీను వైట్ల చెపుతూ...ఈ సురోమంటూ కాలం వెళ్లదీస్తే...మన కళ్లకు లోకం కూడా స్తబ్దుగా కనిపిస్తుంది. చేతల్లో, మాటల్లో హుషారు ఉంటేనే...జీవితంలో కూడా మజా ఉంటుంది. అలా అన్నింట్లోనూ దూకుడు మీదుండే యువకుడిని మా సినిమాలో చూడొచ్చు అంటున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్..పోలీస్ అధికారిగా కనిపించనున్నారు..తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. కామిడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి గోపి మోహన్ కథను అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కేవలం కాసేపు కాకుండా సినిమా అంతటా పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడని చెప్తున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు.

English summary
Dookudu film is said to be an action-packed fun-filled comedy entertainer. Successful director Srinu Vytla is directing it. Samantha Ruth Prabhu is playing the female lead role and Sonia (of Happy Days fame) is playing an important role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu