twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' హిందీ రీమేక్ ఎగ్రిమెంట్ పూర్తి

    By Srikanya
    |

    మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు హిందీ రీమేక్ రైట్స్ కు అన్ని చోట్ల నుంచి పోటీ వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఈ రైట్స్ ని సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత తీసుకుని ఎగ్రిమెంట్ పూర్తి చేసుకుంది. ఆమే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. అయితే కొంత సమయం పడుతుంది ఈ సినిమా ప్రారంభం కావటానికి అని తెలుస్తోంది.ఈ లోగా ఏక్ ధ టైగర్,కిక్ చిత్రాలు పూర్తైన తర్వాత దూకుడు రీమేక్ ప్రారంభమవ్వనుంది. మరో ప్రక్క మహేష్ తన హిందీ రీమేక్ కు సల్మాన్ ఖాన్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు అని ఓ డైలీ తో మాట్లాడుతూ అన్నారు. ఎందుకంటే గతంలో తన పోకిరి చిత్రాన్ని సల్మాన్ రీమేక్ చేసి హిట్ కొట్టడం గుర్తు చేసి చెప్తున్నాడు. ఇక దూకుడు నిర్మాతలే హిందిలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచలో ఉన్నారుట.

    ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే అక్షయ్ కుమార్ ట్రైల్స్ వేస్తున్నారు. మరో ప్రక్క అజయ్ దేవగన్ కూడా తన నిర్మాతలను ఈ సినిమా కోసం పంపుతున్నాడు. ఇక మహేష్ మాటను సల్మాన్ పాజిటివ్ గా తీసుకుని ముందుకు వచ్చి ఈ రీమేక్ ప్రారంభించే అవకాసం ఉంది. ఇక సల్మాన్ ప్రస్తుతం కిక్ రీమేక్ లో ఉన్నారు. అలాగే మొన్నే బాడీగార్డు,రెడీ రీమేక్ లు చేసారు. మరో ప్రక్క తెలుగులో హిట్ అయిన కాంచన చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ అన్ని భాషల వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరో ప్రక్క మిగతా హీరోలు సైతం కామిడీ సినిమాలు అంటేనే ఆసక్తి చూపుతూ వాటిమీదే కాన్సర్టేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Arpita bought the Dookudu Hindi remake rights and the agreement was done.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X