దూకుడు ప్రిన్స్ మహేష్ కాదు పవర్ స్టార్..!
కొమరం పులి సినిమా తర్వాత రేసులో వెనుకపడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ సినిమాలు చేసి మరలా తన అభిమానులు మనసులో స్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. దాని కోసం ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలలో నటించనున్నారు. ప్రస్తుతం లవ్ఆజ్ కల్ సినిమా సిట్టింగ్స్ లో ఉన్నపవన్ కళ్యాణ్ రీమేక్ సినిమానే కాబట్టి త్వరగా పూర్తి చేసి వేరే సినిమా లో నటించాలని తెగ తాపత్రయపడుతున్నాడు.
తమిళంలో అజిత్ తో బిల్లా అనే సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు విష్ణువర్దన్ పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అయ్యి కధ వినిపించడం ఆ కధ పవన్ కళ్యాణ్ ఓకే చేయడం జరిగింది. మర్యాద రామన్న సినిమాని నిర్నించిన ఆర్కే మీడియా వారు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వీటితోపాటు త్రివిక్రమ్ రెడీచేసి ఉంచిన సినిమా కధ ఎక్సట్రార్డినరీగా ఉందని, పవన్ కళ్యాణ్ అభిమానులుకు ఏమేమి కావాలో అన్ని ఈ సినిమాలో ఉంటాయని ఈ సినిమాని కూడా త్వరలో సెట్స్ మీదకు వెల్లనున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











