మగధీరను దూకుడు రికార్డ్ బ్రేక్ చేసిందంటే నమ్మశక్యం కాలేదు: మహేష్

By Sindhu

'పోకిరి' 'మగధీర' సినిమాలు, ఆ టైంలో ఆ సినిమాలు టాలీవుడ్ హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినా వాటిని ఆఫీషియల్‌ గా ఎవరూ డిక్లేర్ చేయవలసిన అవసరం రాలేదు. ప్రేక్షకులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోనే రీతిలో కళ్ళముందు కనబడే కలక్షన్స్ సునామీ క్రియేట్ చేసాయి. దూకుడు తెలుగు సినిమా చరిత్ర లో మరో కొత్త శాసనం లిఖించబడింది. ప్రిన్సు మహేష్ బాబు హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దూకుడు" హయ్యస్ట్ గ్రాసరర్ గా నిలిచింది. అత్యధిక వసూళ్లు చేయటంలో ఇప్పటివరకూ 'మగధీర" పేరిట ఉన్న ఈ రికార్డ్ తాజాగా 'దూకుడు" పరమయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రిన్స్ మహేష్ బాబు నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతా లో అధికారికంగా ప్రకటించారు.

అతను ట్విట్టర్ లో రాసిందేమంటే 'తెలుగు సినీ పరిశ్రమలో 'దూకుడు" అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలవటాన్ని నేను నమ్మలేకపోతున్నా" అంటూ ట్విటర్లో మహేష్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. కాగా, ఈ సినిమా తొలి రోజు నుంచే బ్రహ్మాండమైన కలెక్షన్లు కురిపించడంతోపాటు ఇంకా అనేక ప్రాంతాల్లో ఇదే హవా కొనసాగిస్తోంది. ప్రిన్సు మహేష్ బాబు ఆకర్షణకు, బ్రహ్మానందం మరియు ఎంఎస్ నారాయణ అద్భుతమైన హాస్యం తోడవ్వటంతో ఈ సినిమా చూసేందుకు కుంటుంభ సమేతంగా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.

2009లో విడుదలైనప్పటి నుండి కలెక్షన్లు విషయంలోనూ, అటు వాణిజ్య ప్రదర్శన పరంగానూ 'మగధీర" పరిశ్రమలో ప్రామాణికంగా నిలిచింది. ఇప్పుడు, అంటే దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తరువాత 'దూకుడు" సినిమా గత మగధీర రేసులో పాల్గొంది. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. తమన్ సంగీతాన్ని సమకూర్చగా, సమంతా, మహేష్ బాబుతో జత కట్టింది. ఇప్పుడు మాహేష్‌ బాబు ఆఫీషియల్‌ గా దూకుడు హైయస్ట్ గ్రాసర్ అని డిక్లేర్ చేసాడు. అది నిజమైతే నాలుగు వారాల్లోనే అంతటి 'మగధీర' ను దూకుడు క్రాస్ చేయడం నిజంగా గ్రేట్. బాక్స్ ఆఫీసు చరిత్రను తిరగరాసిన ప్రిన్స్ మహేష్ బాబు, అతని చిత్ర యూనిట్ కు ఈ సందర్భంగా అభినందనలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X