twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు'లో నా గురించే...నాగార్జున

    By Srikanya
    |

    దూకుడు చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...తను ఆ సినిమాలో లేకపోయినట్లకి, తను బ్రహ్మానందం,మహేష్ సంభాషణల ద్వారా సినిమాలో ఉన్నట్లు చాలా మంది అభిమానులు ఫీలయ్యారని నాగార్డున అన్నారు. ఈ విషయం తనకు ఆనదం కలిగించిందని, ఇదే విషయాన్ని బ్రహ్మానందం, శ్రీను వైట్ల కూడా చెప్పారని ఆయన మీడియాతో అన్నారు. రీసెంట్ గా ఆయన ఢమురకం షూటింగ్ నిమిత్రం కర్ణాటక వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే తాను షూటింగ్ బిజిలో పడిపోయి ఇప్పటివరకూ సినిమాని చూడలేకపోయానని,ఈ వారంలోనే సినిమా చూస్తానని అన్నారు. ఇక షూటింగ్ ప్లేస్ గురించి చెపుతూ..బదామిని మొదటిసారిగా చూసాను. అది చాలా అందమైన ప్రాంతం. అక్కడ చాలా గుడులు ఉన్నాయి. నేను వాటిల్లో చాలా వాటిని చూసాను. అమల కూడా అక్కడికి రావటంతో షూటింగ్ లో ఓ రోజు బ్రేక్ తీసుకుని ఆ హిస్టారికల్ ప్లేస్ ని చూసాం అన్నారు. ఈ షూటింగ్ చాలా బాగా జరిగింది అన్నారు.

    నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ... గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    "So many people called me and told me that even though I'm not physically present in the film, the audience felt like I was a part of it. Even Srinu Vaitla and Brahmanandam told me about it. Since I was very busy with my shooting schedule for the last few weeks, I couldn't catch it. I will watch the movie this week,"says Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X