దూకుడు నిర్మాత డ్యామేజ్ కంట్రోలు స్కీమ్
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు పై రకరకాల రూమర్స్ రోజూ ప్రచారంలోకి వస్తన్న సంగతి తెలిసిందే. ఫస్టాఫ్ బావుంది..సెకండాఫ్ డల్ గా ఉందని, పోకిరికి కామెడి టచ్ ఇచ్చిన సినిమా అని ఇలా రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి దూకుడు నిర్మాతలు ఓ ప్రక్క ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేగాక తమ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ ని రకరాకలుగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవకుండా రోజూ మీడియాలో తమ సినిమా గురించి రకరకాలుగా గొప్ప గొప్పగా చెప్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే అస్సలు మేమే సెకెండాఫ్ చూడలేదు..మీరు ఎలా చెప్పగలుగుతారు అన్నారు. ఇక మరో విషయం నిన్ననే క్లైమాక్స్ లో వచ్చే పాటను ఎడిట్ చేసాం. పూవై పాట షూటింగ్ జరుగుతోంది. కాబట్టి మహేష్ అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు అని కొట్టి పారేస్తూ చెప్తున్నారు.
అలాగే నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్ చేసిన నిర్మాతలు అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు.తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











