మహేష్ బాబు మ్యారేజ్ సాంగ్ హైలెట్
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడుకోసం గత మూడురోజులుగా మ్యారేజ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. దాదాపు 25 మంది పాపులర్ ఆర్టిస్టులు ఈ పాట షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ పాట చాలా కలర్ ఫుల్ గా శ్రీను వైట్ల చిత్రీకరించాడని,మహేష్ కెరీర్ లో నిలబడిపోయే పాటగా దీన్న చిత్రీకరించారని చెప్తున్నారు.అలాగే పాటలో తెలుగు తనం,తెలుగు సంస్కృతి,సపరివార అనుబంధం పాటలో ప్రతిబింబిస్తుందని చెప్తున్నారు.నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్ చేసేశారు. అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమైపోతున్నారు. తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు.
ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











