‘దూకుడు' బెంగాలి రీమేక్ రికార్డులు

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు 'దూకుడు'చిత్రం వరస ప్లాపుల్లో ఉన్న మహేష్ ని నిలబెట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బెంగాల్ లోకి సైతం రీమేక్ చేసారు. ఆ చిత్రం అక్కడా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోయింది. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం బెంగాళ్ వెర్షన్ టైటిల్ ఛాలెంజ్ 2. బెంగాళ్ సినీ చరిత్రలోనే తొలిసారిగా 270 థియోటర్లలలో విడుదలైంది. త్వరలో ఎబ్రాడ్ లోనూ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసారు.అలాగే చిత్రం విడుదలైన నాలుగు రోజులకే బడ్జెట్ లోని ఎనభై శాతం రికవరీ అయ్యిందని అన్నారు.

మరో ప్రక్క 'దూకుడు' బుల్లితెరపై ప్రసారం అవుతూ టీఆర్పీ రేటింగ్ లలోనూ రికార్జులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్ టైన్మెంట్స్ ఛానల్ 'మా టివి' ఈచిత్రాన్ని ప్రసారం చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్న 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంటలు రూపొందించారు.

కామెడీ, యాక్షన్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెుంట్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని మసాలాలు బాగా దట్టించి రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే భారీగా ప్రేక్షకాదరణ పొంది తెలుగు సినిమా గర్వించదగ్గ హిట్లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఈచిత్రంలో ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం పండించే కామెడీ సీన్లు చూసి ఇంటిల్లిపాదీ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం సీక్వెల్ చేయాలని మహేష్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దాంతో 'దూకుడు 2'కి దర్శకుడు శ్రీను వైట్ల స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దూకుడులోని పాత్రకు కొనసాగింపుగా ఈ చిత్రం తయారవుతోంది. అయితే బ్యాక్ డ్రాప్ మారుతుందని,కామిడీ కూడా కొత్త తరహాలో ఉండేటట్లుగా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X