»   » 'దూకుడు' ఆడియో విడుదల విశేషాలు

'దూకుడు' ఆడియో విడుదల విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు ఆడియో నిన్న (గురువారం)విడుదల అయ్యింది. శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకలో మహేష్ బాబు, సమంత, శ్రీను వైట్ల, బ్రహ్మానందం, రచయితలు గోపీమోహన్, కోన వెంకట్, సంగీత దర్సకుడు తమన్ పాల్గొన్నారు. రాజమౌళి ఛీఫ్ గెస్ట్ గా హాజరై సిడి ఆల్బమ్ లను ఆవిష్కరించి మరో దర్సకుడు సుకుమార్ కి అందించారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ పంక్షన్ లో పాల్గొంది. దిల్ రాజు, ఆదిశేషగిరిరావు,రాహుల్ నంబియార్ వంటి వారు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మీకందరికి తెలుసు నా సినిమా విడుదలకు ముందు నేను స్టేజిల పెద్దగా మాట్లాడనని, కానీ ఇప్పుడు సినిమా మీద నా ఫీలింగ్స్ ని మీకు చెప్తున్నాను. డైరక్టర్ శ్రీను వైట్ల రక్తం ఓడ్చి ఈ సినిమాని రూపొందించారు. అతనితో పనిచేయటం ఓ గొప్ప అనుభవం. ఆయన బ్రాండ్ ఎంటర్టైన్మెంట్ కి తమన్ సంగీతం తోడై అద్బుతంగా వచ్చింది. ఆడియో అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను.సమంత ఫెరఫెక్ట్ కో స్టార్. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారే నాకు ప్రేరణ. నేను మహేష్ ని ఎప్పుడూ ఓ బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తాను.నాకు ఈ సినిమాని హిట్ చెయ్యాల్సిన భాధ్యత ఉంది అన్నారు.

English summary
Music albums of Mahesh Babu’s much waited Dookudu were unveiled at the special launch ceremony held at Shilpa Kala Vedika on Thursday, August 18, 2011.Rajamouli was the chief guest and he unveiled the CD albums and handed over to director Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu