రూ. 5 కోట్లతో బుల్లితెరపై మహేష్ దూకుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'దూకుడు' త్వరలోనే బూల్లితెరపై ప్రసారం కానుంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్ టైన్మెంట్స్ ఛానల్ 'మా టివి' జూన్ 3న(ఆదివారం) ఈచిత్రాన్ని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
కామెడీ, యాక్షన్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెుంట్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని మసాలాలు బాగా దట్టించి రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే భారీగా ప్రేక్షకాదరణ పొంది తెలుగు సినిమా గర్వించదగ్గ హిట్లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఈచిత్రంలో ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం పండించే కామెడీ సీన్లు చూసి ఇంటిల్లిపాదీ కడుపుబ్బా నవ్వుకోక తప్పదు.
ఇక మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, సమంత గ్లామర్ గురించి కొత్తగా చెప్పక్కలేదు అనుకుంటా. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్న 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంటలు రూపొందించారు.
ఇప్పటికే మాటీవీ వారు ఈ సినిమా గురించి భారీ ఎత్తున ప్రమోషన్ ప్రారంభించారు. ఈ చిత్ర ప్రసార సమయంలో భారీగా టీఆర్పీ రేటింగులు వచ్చి మంచి లాభాలు వస్తాయని ఛానల్ యాజమాన్యం భావిస్తోంది.


Click it and Unblock the Notifications











