పొరుగు రాష్ట్రంలో కేకపెట్టిస్తున్న దూకుడు కలెక్షన్స్..!?
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'దూకుడు" చిత్రం ఒక భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆఖరికి ఈ చిత్రం అమెరికా లోకూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా కర్ణాటకలో సుమారుగా 3.5 కోట్ల రూపాయలు సేకరించినట్టు సమాచారం.
కన్నడ ప్రాంతంలో ఒక తెలుగు సినిమా ఇంతటి అద్భుతమైన వసూళ్లు రాబట్టటం విశేషమనే చెప్పొచ్చు. ఇప్పటికీ అనేక ప్రాంతాలలో ఈ సినిమా హవా కొనసాగుతుండటంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అల్ టైం రికార్డు దిశగా సాగిపోతుంది అనటంలో సందేహం అక్కరలేదు. దూకుడు విజయ విహారం పై చిత్ర యూనిట్ మొత్తం ఖుషీగా ఉంది.
ఈ బంపర్ ఫలితాన్నిప్రిన్స్ మహేష్ బాబు తో సహా అందరూ ఆస్వాదిస్తున్నారు. తన రాబోయే చిత్రం 'బిజినెస్ మాన్" చిత్ర షూటింగ్ కోసం ముంబై లో బిజీ గా ఉన్న ప్రిన్స్ ఇటీవల నోవోటెల్ లో జరిగిన సక్సస్ పార్టీకి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రిన్స్ మహేష్ బాబు సినీ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమానేకాదు, బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమా 'పోకిరి" రికార్డ్స్ చెరిపేయటమే కాదు ఇప్పుడు స్థిరంగా మగధీర రికార్డ్స్ వైపు చూస్తుంది. చూద్దాం..'మగధీర"ని అధిగమించేటంత 'దూకుడు" ప్రదర్శిస్తుందో….. లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











