For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'దూకుడు' కోసం జాన్ డో అనే ఈ యాక్ట్‌ను తెచ్చాం

  By Srikanya
  |

  మేం పడ్డ కష్టానికి ఫలితాన్ని కూడా మేమే అనుభవించాలి. ఎవరో పైరసీ చేస్తే ఊరుకోం. 'దూకుడు' సినిమాపై సంపూర్ణ కాపీరైటు మా 14రీల్సు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్‌కు ఉంది. ఈ సినిమాను యథాతథంగాగానీ, మార్పులతో గానీ, ఏ విధంగాగానీ ఎవరూ మా అనుమతి లేకుండా కాపీ చేయకూడదు. ప్రదర్శించకూడదు. డిజిటల్ ఫార్మాట్‌లో, పీటూపీ ఫైల్ రూపంలో పంచుకోవడం, ఆన్‌లైన్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఈ అక్రమ చర్యలన్నింటినీ నిషేధిస్తూ ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయస్థానం (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు) ఇంజక్షన్ ఇచ్చింది. జాన్ డో అనే ఈ యాక్ట్‌ను తెలుగు పరిశ్రమలో తొలిసారి మేం తీసుకొచ్చాం.శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర దూకుడు చిత్రాన్ని నిర్మించారు. మంగళవారం వరకు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి అధికారికంగా ధృవపత్రం వెలువడనందున ఈ సినిమా శుక్రవారం విడుదలవుతుందా, లేదా? అని పలువురిలో సందేహం నెలకొని ఉంది. ఆ సందేహాలను నివృత్తి చేస్తూ నిర్మాతలు బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచమంతటా శుక్రవారం దూకుడు విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  అలాగే హిందీలో 'సింఘం'కు తీసుకొచ్చారు. ఎవరైనా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారు. కృష్ణ, మహేష్ అభిమానులు కూడా పైరసీ నిర్మూలనకు నడుంబిగించాలి. విజిలెన్స్ ఫోర్సులాగా పనిచేయాలి. మా తరఫున కూడా 20 మంది సభ్యులతో కూడిన బృందం పైరసీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది'' అని చెప్పారు. 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న దూకుడు చిత్రం గురించి నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర విలేకరుల సమావేశంలో ఇలా స్పందించారు. రామ్‌ ఆచంట మాట్లాడుతూ ఒక్క నైజాంలోనే 207 థియేటర్లలో విడుదల చేస్తున్నామన్నారు. ఈ థియేటర్ల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉన్నదన్నారు. తప్పక ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ఇక మా సినిమా సెన్సార్ కాలేదని, అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంగళవారం మా చిత్రానికి సెన్సార్ పూర్తయింది. యుఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్ళి చూడాల్సిన సినిమా. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. డీఐ ప్రత్యేకంగా ఉంటుంది. విజువల్ ఫీస్ట్ అని అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించాం అన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

  English summary
  Anil Sunkara requested the people to watch the movie in theater itself and not to encourage piracy. A special order has been issued by the court to kill piracy and they are implementing it for Dookudu, he adds.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X