'దూకుడు' నిర్మాత డైరక్షన్ ఉగాది రోజే
మహేష్ బాబుతో దూకుడు వంటి మెగా హిట్ చిత్రం ఇచ్చిన నిర్మాత అనీల్ సుంకర త్వరలో దర్శకుడు అవతారం ఎత్తుతున్నారు. అల్లరి నరేష్, కిక్ శ్యామ్, రాజు సుందరం, వైభవ్ ప్రధాన పాత్రలుగా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని త్రిడీ ఫార్మెట్ లో తెరకెక్కించనున్నారు. ఇందుకోసం యుఎస్ ఎ నుంచి సాంకేతిక నిపుణులు వస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ గా కామ్నా జట్మలానీ, విమలా రామన్, స్నేహా ఉల్లాల్ నటించనున్నారు. ఈ ప్రారంభోత్సవం చెన్నై సిటీలో చేస్తున్నారు. ఈ చిత్రం ఉగాది రోజు ప్రారంభమవుతుంది.
గతంలో ఈ నిర్మాత అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట చిత్రం నిర్మించారు. పూల రంగడు దర్శకుడు వీరభద్రమ్ డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రం బాగా ఆడింది. ఇక ప్రస్తుతం ఈ నిర్మాతలు సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం ఓపెనింగ్ ఆ మధ్యనే మొదలైంది. ఇందులో మహేష్.. లెక్చరర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ధ్రిల్లర్ గా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











