సంబర పడిపోతున్న ’దూకుడు’ నిర్మాతలు
మహేష్ బాబు-సమంత జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న 'దూకుడు" సినిమా పాటలు మంచి సక్సెస్ సాధించడంతో ఆ సినిమా నిర్మాతలు సంబర పడిపోతున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం దూకుడు ఆడియో ఆగస్టు 18న విడుదలై శ్రోతల ఆదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ....'తమన్ సంగీతం అందించిన దూకుడు ఆడియోకి అద్భుతమైన రెస్సాన్స్ వస్తుందన్నారు. ఆడియో మార్కెటింగ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు మహేష్ బాబు చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ ఆడియోగా దూకుడు రికార్డు సృష్టిస్తుందని చెబుతున్నారని వెల్లడించారు. చిత్ర షూటింగ్ పూర్తి కావస్తోందని, అతి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఆడియో సూపర్ హిట్ చేసిన శ్రోతలకు, మహేష్ బాబు అభిమానులకు థాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











