మహేష్ దూకుడు విడుదలతేది ఖరారు...!?

'దూకుడు" లాంటి మంచి సినిమాని ఇచ్చిన శ్రీనువైట్ల గారికి థాంక్స్. రామ్, గోపి అనీల్ నా కెరీర్ లో బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఫాన్స్, ఆడియన్స్ నానుండి ఎలాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో అలాంటి మంచి కమర్షియల్ సినిమా 'దూకుడు" అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ నాకెరీర్ లో ఇంతవరకు చేసిన అన్ని సినిమాల కంటే పెద్ద రేంజ్ సినిమా 'దూకుడు" మహేష్ బాబుతో వర్క్ చేస్తుంటే స్వంత తమ్ముడితో సినిమా తీస్తున్నట్టుగా వుంది. 24గంటలూ సినిమా బెటర్ మెంట్ కోసం కషి చేసే హీరో మహేష్ బాబు. మళ్ళీ మళ్ళీ మహేష్ తో వర్క్ చేయాలని వుంది. ఈ దూకుడు మహేష్ తప్ప ఎవ్వరూ చేయలేరు. నా నిర్మాతలు కాంప్రమైజ్ అవకుండా తీసిన సినమా ఇది ఆల్ రెడీ తమన్ మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. దూకుడు సినిమా కూడా అందరి ఎక్స్ పెక్టేషన్స్ కి ధీటుగా ఉంటుందన్నారు.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, సోనూసూద్, షాయాజి షిండే, నాజర్, తదితరు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications










