‘దూకుడు’ ఆగస్టు 12న విడుదల చేయబోతున్నారు

By Srikanya

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దూకుడు" చిత్రం ఆగస్టు 12న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ చిత్రం ఆడియోని జూలై 10వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. 'ఖలేజా" చిత్రం తర్వాత మహేష్‌ బాబు నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంతా హీరోయిన్‌ గా నటిస్తోంది. హ్యాపిడేస్ సోనియా'దూకుడు" చిత్రంలో ఓ ప్రముఖ పాత్రను పోషిస్తోంది.హ్యాపీడేస్, 'వినాయకుడు, బ్రహ్మాలోకం టు యమలోకం వయా భూలోకం"లో నటించిన సోనియాను ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వరించింది.

16 రీల్స్‌ బ్యానర్‌ పై రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 'దూకుడు" టైటిల్‌ కు తగ్గట్టుగా ఈ చిత్రంలో 'నీ దూకుడుకు సాటెవ్వడు..." అంటూ సాగే ఓ సాంగ్‌ ని పెట్టారు. అలాగే్ ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఈ చిత్రానికి 'కిక్", 'బృందావనం" ఫేం తమన్ సంగీతం అందిస్తున్నాడు.

శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు. 'దూకుడు" కథపై ఎప్పటికంటే ఎక్కువ రోజులు కష్టపడిన శ్రీను వైట్ల మహేష్ మెచ్చే రేంజ్ లో స్టోరీ అద్భుతంగా రెడీ చేశాడని చెప్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X