For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' లెంగ్త్, రన్ టైమ్ ఎంతంటే...

    By Srikanya
    |

    మహేష్ తాజా చిత్రం 'దూకుడు' ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 50400 ఫీట్స్ తో ఉంది. రెండు గంటల యాభై నిముషాల రన్ టైమ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంకి సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే దూకుడు హైదరాబాద్ లో డబ్బై స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. అలాగే చెన్నై సిటీలోనూ 17 స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. ఇప్పటివరకూ ఇన్ని స్క్రీన్స్ లతో ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. అలాగే నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్‌ చేసిన నిర్మాతలు అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు. తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు.

    ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్. సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను. నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

    English summary
    Dookudu has received a U/A certificate from the censor board and we can tell you that the length of the film reel is 50400 feet. That should translate into about IT2hrs 50minutes of run time when titles and other things are taken into account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X