భయానికి మీనింగే తెలియని మహేష్
భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది అంటూ మహేష్ బాబు దూకుడు సెకెండ్ టీజర్ రిలీజ్ అయ్యింది.స్టైలిష్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు.శ్రీను వైట్ల దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.దూకుడు చిత్రం షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది.మహేష్ బాబు పై ఒక ఏక్షన్ సన్నివేసం మరియు ఒక చిన్న టాకీ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో ఈ నెల 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతునట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి గాని, సెప్టంబరు మొదటి వారం లో కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు.తమన్ తోలిసారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్, ముంబై, స్విట్జర్లాండ్ లలో షూటింగ్ జరుపుకుంది.ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.


Click it and Unblock the Notifications











