'దూకుడు'షూటింగ్ కి అనుకోని అవాంతరం
దూకుడుని ఎంత దూకుడుగా షూటింగ్ ముంగించి ఫినిష్ చేద్దామనుకున్నా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది.ఈ రోజు షూటింగ్ కి ముంబైలోని వానలు అడ్డొచ్చాయి.అవుట్ డోర్ లో పూర్తి చేయాల్సిన సీన్స్ ఉండటం,వర్షం అనుకోని విధంగా పడటంతో షూటింగ్ కాన్సిల్ చేసారు.మరో ప్రక్క మొదట మేము అనుకున్నదానికంటే 'దూకుడు"సినిమాకి బడ్జెట్ ఎక్కువే అయ్యిందీ అంటున్నారు నిర్మాతలు.అయితే దానికి కారణం ఇటీవల జరిగిన సినీపరిశ్రమ సమ్మె అంటున్నారు.ఇక 'దూకుడు" చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్య మంచి టాక్ తెచ్చుకున్నాయి.
సినిమా విషయానికి వస్తే శ్రీను వైట్ల టైమింగ్, మహేష్ టైమింగ్ కలిస్తే 'దూకుడు"అంటున్నారు. టైటిల్‌కి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ నట విశ్వరూపాన్ని చూస్తారు.ఏదిఏమైనా అద్భుతం అనిపించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు శ్రీనువైట్ల. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్, సాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మాస్టర్ భరత్, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, రచన: గోపి మోహన్, కోన వెంకట్, సమర్పణ: జి.రమేష్‌బాబు.


Click it and Unblock the Notifications











