అదరకొడ్తున్న'దూకుడు' పాటలు
మహేష్ బాబు, సమంత కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించుతున్న చిత్రం దూకుడు. ఈ చిత్రం పాటలు రెండు బయటకు విడుదలయ్యాయి.“నీ దూకుడు" మరియు “దేతడి దేతడి" పాటలు టీజర్లుగా విడుదల చేసారు.ఆకట్టుకునే ట్యూన్స్ తో , మాస్ ను అలరించే విధంగా ఉన్న ఈ పాటలు ఆడియో విజయంపై నమ్మకాన్ని కలగ చేస్తున్నాయి.దూకుడు చిత్రం ఆడియో ఈ రోజు శిల్ప కళా వేదికలో ఘనంగా జరగనుంది.ఇక మహేష్ బాబు 'దూకుడు" సినిమా ఆడియో ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా....ఈ నెల 18కి అంటే ఈ రోజుకు వాయిదా పడింది.
ఈ విషయాన్ని ఆడియో వాయిదా అంశాన్ని మహేష్‌బాబు కూడా ధృవీకరించారు. అయితే ఆడియో వేడుక వాయిదా వార్త విన్న ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ప్రొడ్యూసర్ల వాదన మరోలా ఉంది. ఆడియో వేడుక ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏర్పాటు పూర్తి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. 18న నిర్వహించే వేడుకను చూసి అభిమానులు ఖశ్చితంగా సంతృప్తి పొందుతారని స్పష్టం చేశారు. తమన్ ఇప్పటికే పాటల కంపోజింగ్ పూర్తి చేశారు.దూకుడు పాటలు తన గత సినిమాల్లో కెల్లా బెస్ట్ పాటలుగా నిలుస్తాయని మహేష్ తన ట్వట్టర్ రాసుకున్నాడు.


Click it and Unblock the Notifications











