మహేష్ దూకుడులో ఓ స్పెషల్ సాంగ్ కి ‘ట్రై కోట్ డ్రమ్స్’..!?
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక పొతే ఈ సినిమాలోని రెండు పాటలను విదేశాలలో రికార్డింగ్ చేయనున్నారని సంగీత దర్శకుడు తమన్ తెలియజేసాడు. మొత్తం ఏడు పాటలలో ఐదు హైదరాబాద్ లోనే రికార్డు చేశారు. మిగిలిన రెంటిలో ఒక పాటను ట్రై కోట్ డ్రమ్స్ అనే ప్రత్యేకమైన వాయిద్యం కోసం చైనాలో, మరో పాటను చెక్ రిపబ్లిక్ లోని ప్రాగ్ సిటిలో రికార్డు చేయనున్నారు.
ఈ సినిమాలో మహేష్ పాత్ర వైవిద్యంగాను, ఆయన మాట్లాడే విధానం హావభావాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్రవర్గాలు తెలియజేస్తున్నాయి. సమంతా మహేష్ తో జోడి కడుతున్న ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకేక్కిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ విని ఇన్స్ పైర్ అయిన మహేష్ బాబు తన తదుపరి సినిమా 'బిజినెస్ మేన్' కి కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా రికమెండ్ చేశాడట. ప్రముఖ దర్శక నిర్మాత, ఏఎన్నార్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘంటశాల బలరామయ్యగారి మనవడైన తమన్ ఇప్పుడు తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద హీరోలు చాలా మంది అతనే కావాలంటున్నారు!


Click it and Unblock the Notifications











