నోవోటెల్ లో 'దూకుడు' సక్సెస్ పార్టీ
మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు" ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ పార్టీని నిన్న(సోమవారం)సాయింత్రం నొవోటోల్ లో జరిపారు. అందుకోసం మహేష్ బాబు ముంబైనుంచి దిగారు. తాను చేస్తున్న ది బిజెనెస్ మ్యాన్ చిత్రం నుంచి బ్రేక్ తీసుకుని ఈ పార్టీకి హాజరయ్యారు. ఇక ఈ పార్టీకి తెలుగు పరిశ్రమలోని పెద్దలంతా హాజరయ్యారు.ముఖ్యంగా ఈ పార్టీలో ప్రముఖ నిర్మాతలు.. శ్యాం ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, దిల్ రాజు ఇంకా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్టార్స్ హాజరయ్యినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ ఈ పార్టీకి ప్రత్యేకంగా అటెండయ్యారు.
ఇక క్రిందటి వారం దూకుడు చిత్ర బృందం.. దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత గోపీమోహన్, నిర్మాతలు, కోస్త ఆంధ్ర లో 'దూకుడు" ప్రదర్శింపబడుతున్న అనేక థియేటర్లలో ప్రేక్షకులను కలిసి విజయోత్సవ టూర్ చేసారు. ఇక మహేష్ బాబు గత కొన్ని వారాలుగా పూరీ జగన్నాధ్ దర్సకత్వం వహిస్తున్న 'బిజినెస్ మాన్" షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ కారణంగానే 'దూకుడు" ప్రమోషన్ లోకూడా అయన పాలు పంచుకోవటం లేదు. ఇటీవల మహేష్ బాబు , వెంకటేష్ కలయిక తో వస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు.


Click it and Unblock the Notifications











