ఫిల్మ్ ఫేర్ అవార్డులలో మహేష్ ...'దూకుడు'
59 వ ఐడియా ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల పంక్షన్ నిన్న(జూలై 7) చెన్నైలో జరిగింది. సౌత్ కి చెందిన తమిళ,మళయాళ,కన్నడ,తెలుగు సినిమాలలో నెంబర్ వన్ గా ఎక్కువ అవార్డులు గెలుచుకుని దూకుడు నిలిచింది. ఆరు అవార్డులు ఈ చిత్రం సాధించింది. శ్రీనువైట్ల,మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ పరంగానూ ఘన విజయం సాధించింది. ప్లాపుల్లో ఉన్న మహేష్ కు ఈ చిత్రం హిట్టిచ్చి నిలబెట్టింది.
అవార్డులు కేటగిరీ వైజ్ చూస్తే..
బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు(దూకుడు)
బెస్ట్ ఫిల్మ్ దూకుడు
బెస్ట్ డైరక్టర్ శ్రీను వైట్ల(దూకుడు)
బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ (దూకుడు)
బెస్ట్ సపోర్టింగ్ నటుడు ఎమ్.ఎస్ నారాయణ(దూకుడు)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ రాహుల్ నంబియార్(గురువారం మార్చి ఒకటి సాంగ్...దూకుడు)
ఇక మిగతా విభాగాల్లో...
బెస్ట్ యాక్ట్రస్ నయనతార(శ్రీరామ రాజ్యం)
బెస్ట్ సపోర్టింగ్ ఏక్ట్రెస్ అన్నె(రాజన్న)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ (జగదానంద కారక) శ్రీరామ రాజ్యం
బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్(నాధ్..నాధ్..బద్రీనాద్ చిత్రం)
బెస్ట్ డిబ్యూట్ ఏక్ట్రెస్ (ఫిమేల్) శృతిహాసన్(అనగనగా ఒక ధీరుడు)
ఈ పంక్షన్ లో..మహేష్ బాబు,శ్రీను వైట్ల,విక్రమ్, నయనతార, శృతి హసన్,లక్ష్మి మంచు, కార్తీ, అనీల్ సుంకర, రిచా గంగోపాధ్యాయ, ప్రియమణి,సుజన తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











