టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. తొలి తెలుగు యాంకర్ మృతి!

దేశంలోని అన్ని సినీ రంగాల్లో వరుసగా విషాదకర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అకాల మరణం చెందుతున్నారు. ఇటీవలే నటుడు డానియల్ బాలీజీ, రైటర్ శ్రీ రామకృష్ణ, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ విశ్వేశ్వర రావులు ప్రాణాలు విడిచారు. వీరి మరణం నుంచి అందరూ తేలుకోకముందే మరో గ్రేట్ న్యూస్ రీడర్ ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా తొలి తెలుగు న్యూస్ రీడర్ ప్రాణాలు విడిచారు. ఆయన ఎవరు, ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి తెలుగు న్యూస్ రీడర్ గా పని చేసిన శాంతి స్వరూప్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు దూరదర్శన్ లో మాత్రమే వచ్చే వార్తల్లో కనిపించే ఈయన.. తాజాగా ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఈయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోధ ఆస్పత్రిలో చేర్చారు. అయితే రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఈయన ఈరోజు ఉదయం మరమించారు. శాంతి స్వరూప్ మరణ వార్త తెలుసుకున్న అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

Dooradarshan First News Reader Shanthi Swaroop Paased Away Due to Health Issues

పదేళ్ల పాటు టెలీ ప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి మాత్రమే న్యూస్ చదివిన ఈయన మరణ వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 1983 నవబంర్ 14వ తేదీ నుంచి ఆయన దూరదర్శన్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించారు. ముఖ్యంగా ఏమైనా బ్రేకింగ్ వార్తలు వస్తే.. ఇంగ్లీషులో రాగా.. వాటిని చూస్తూనే ఆయన తెలుగులో అనవాదించుకునీ మరీ చదివేవారు. అంతటి సమర్థులైన శాంతి స్వరూప్.. 2011 వరకు దూరదర్శన్ లో పని చేశారు.

దాదాపు 27 ఏళ్ల పాటు నిర్విరామంగా వార్తలు చదివి.. అనేక విషయాలను అందరికీ అందించిన ఈయన గొంత ఈరోజుతో మూగబోయింది. శాంతి స్వరూప్ కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య కూడా న్యూస్ ఛానెల్ లోనే పని చేయగా.. వీరిద్దరూ ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. ఆమె గతంలోనే చనిపోగా.. వీరి కుమారులు ఇద్దరూ ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X