మంచు విష్ణు 'దూసుకెళ్తా' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా బిందాస్, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 11న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఈనెల 28న పాటల్ని వినిపిస్తారు.
విష్ణు మాట్లాడుతూ ''ఢీ, దేనికైనా రెడీ తరవాత నా కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. వినోదం, యాక్షన్‌లు కలగలిపిన ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సాంకేతికంగానూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. మణిశర్మ బాణీలు అదనపు బలం'' అన్నారు.
దర్శుకుడు మాట్లాడుతూ... ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, పంకజ్ త్రిపాఠీ, రఘుబాబు, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సమర్పణ: ఆరియానా, వివియానా.


Click it and Unblock the Notifications












