విష్ణు ‘దూసుకెళ్తా’ టాక్ ఎలా ఉందంటే..?
హైదరాబాద్: వరుస ప్లాపులతో ఇక కెరీర్ ఎండ్ అయిపోయినట్లే అని అంతా అనుకుంటున్న తరుణంలో 'దేనికైనా రెడీ' అంటూ హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి వచ్చిన హీరో మంచు విష్ణు.....ఈ సారి 'దూసుకెళ్తా' అంటూ బాక్సాఫీసు బరిలో దూకాడు. ఈ రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.
సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా వినోదాత్మకంగా ఉందని, విష్ణు పెర్ఫార్మెన్స్ బాగుందని, బ్రహ్మానందంతో కలిసి కామెడీ ఇరగదీసాడని అంటున్నారు. అదే విధంగా డైలాగులు, స్ర్కీన్ ప్లే సినిమాకు మరింత ప్లస్సయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాకు హీరోయిన్ మైనస్ అయిందని అంటున్నారు.
మొత్తానికి...సినిమా హిట్ టాక్ రావడంతో మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ, అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. బిందాస్, రగడ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వీరు పోట్ల......'దూసుకెళ్తా' సినిమా హిట్‌తో మరో మెట్టు పైకెక్కాడు. ఓ వైపు కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న ఆనందంలో ఉన్న ఆయనకు 'దూసుకెళ్తా' హిట్టయిందనే వార్త మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈచిత్రంలో మంచు విష్ణు వర్ధన్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సమర్పణ: ఆరియానా, వివియానా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.విజయకుమార్, నిర్మాత : మంచు మోహన్‌బాబు, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వీరూ పోట్ల.


Click it and Unblock the Notifications












