మంచు విష్ణు కొత్త చిత్రం 'దూసుకెళ్తా'..డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : మంచు విష్ణు తన తాజా చిత్రానికి 'దూసుకెళ్తా' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మాత...అందాల రాక్షసి ఫేమ్ లావణ్య హీరోయిన్. 24 ఫ్రేమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక,నిర్మాతలు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.

ఇక ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కళ: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌, సమర్పణ: అరియానా, వివియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X