ఇరవై యేళ్లకే ఇన్ని పనులా.. ఆర్జీవీని మించిపోయేలా ఉన్నాడే!!

రామ్ గోపాల్ వర్మ తీయన చిత్రమంటూ లేదు.. వేయని కామెంట్ అంటూ లేదు. ఎప్పుడు ఎలా ఉంటాడు.. ఎప్పుడు ఏ చిత్రాన్ని తీస్తాడు.. ఏ సమయంలో ఎలాంటి వివాదాలకు దారి తీస్తాడో ఊహించడం కష్టమే. దేవుడినే నమ్మను అని చెప్పే ఆర్జీవీ నేడు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన బయోపిక్‌గా రాబోతోన్న రాము చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకల్లో ఆర్జీవీ సెంటిమెంట్స్‌ను బాగానే ఫాలోఅవుతున్నట్టు కనిపిస్తోంది.

మూడు భాగాల్లో రాము..

మూడు భాగాల్లో రాము..

పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్ ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే న గా నటించబోతున్నా.పార్ట్ 1 "రాము " దీంట్లో నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది తాను చూపించబోతోన్నట్టు వర్మ తెలిపాడు.

ప్రేమాయణం, వివాదాలు..

ప్రేమాయణం, వివాదాలు..

పార్ట్ 2 "రామ్ గోపాల్ వర్మ" -అండర్ వరల్డ్ తో ప్రేమాయణం. ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి. పార్ట్ 3 "RGV"
-ది ఇంటెలిజెంట్ ఇడియట్ . ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి. అంటూ ఆర్జీవీ ట్వీట్స్ చేశాడు.

షూటింగ్ ప్రారంభం.

షూటింగ్ ప్రారంభం.

నేడు రాము చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు తన అమ్మ సూర్యవతి కెమెరా స్విచ్ ఆన్, సోదరి విజయ క్లాప్ కొట్టారని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా మరో విషయాన్ని కూడా వర్మ తెలిపాడు. మొదటి పార్ట్‌లో ఆర్జీవీ పాత్రలో నటించే వారెవరో కూడా పేర్కొన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 10 Highlights
ఇరవై యేళ్లలోనే ఇలా..

ఇరవై యేళ్లలోనే ఇలా..

మొదటి పార్ట్‌లో దొరసాయి తేజ కేవలం నా యంగ్ పాత్రలో నటించడమే కాదు.. సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అతని వయసు కేవలం 20 ఏళ్లే. మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాడని వర్మ పేర్కొన్నాడు. ఇరవై యేళ్లకే ఇలా వర్మను మెప్పించాడంటే.. భవిష్యత్తులో కచ్చితంగా ఆర్జీవీని మించిపోయేలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X